: రాజధాని రైతులకు చంద్రబాబు మరో వరం!


నవ్యాంధ్ర రాజధాని తుళ్ళూరు పరిధిలోని 29 గ్రామాల్లోని రైతులకు ఒకే దఫాలో పంట రుణ మాఫీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఒకేసారి రూ.1.5 లక్షలు రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబుతో ఈ విషయాన్ని చర్చించామని, దానిపై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆయన ఆదేశాలు పంపినట్టు చెప్పారు. రెండు రోజుల్లో రాజధాని రైతులందరికీ రుణ మాఫీ జరుగుతుందని, ఇందుకోసం రూ.186 కోట్లు ఖర్చు చేయనున్నామని పేర్కొన్నారు. తుళ్ళూరు ప్రాంతంలో భూ సమీకరణ వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా 10 వేల ఎకరాలు, ఫిబ్రవరి 10 తేదీలోగా 18 వేల ఎకరాలు సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News