: చైతన్య స్కూల్ బస్సులకు నిప్పు... ఆత్మకూరులో గుర్తు తెలియని దుండగుల దుశ్చర్య


అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు చైతన్య స్కూల్ కు చెందిన రెండు బస్సులకు నిప్పు పెట్టారు. నేటి ఉదయం వెలుగుచూసిన ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కలకలం రేపింది. ఈ ఘటనపై సదరు పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆకతాయిలు చేసిన పనిగా భావిస్తున్న ఈ ఘటనలో రెండు బస్సులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. పాఠశాల యాజమాన్యం నుంచి ఫిర్యాదునందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనకు కారకులైన వ్యక్తుల కోసం గాలింపు మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News