: పాలమూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఏడుగురు దుర్మరణం


మహబూబ్ నగర్ జిల్లాలో నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కేరళకు చెందిన ఇన్నోవా, మహారాష్ట్రకు చెందిన టవేరా వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కేరళకు చెందిన ఓ మహిళ చనిపోగా, మహారాష్ట్రకు చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం నేపథ్యంలో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది.

  • Loading...

More Telugu News