: భారత్, అమెరికా లక్ష్యం ఒక్కటే: మోదీ


భారత్-అమెరికా సిఈఓల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్, అమెరికా దేశాల లక్ష్యం ఒక్కటేనని అన్నారు. అనంతంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యమని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని వివరించారు. కొత్త సర్కారు ఏర్పడిన 6 నెలల్లో అమెరికాలో 50 శాతం మేర పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. పరిశుద్ధ గంగ ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. భారీ ప్రాజెక్టుల పురోగతిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని మోదీ స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం ఐదేళ్ల దిగువకు పడిపోయిందని, దేశంలోని ప్రతి భారతీయుడికి ఇల్లు కావాలంటే ఏడేళ్లలో ఏటా 50 లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉంటుందన్నారు. ఇక, స్వతంత్ర భారతావనిలో పుట్టిన తొలి ప్రధానిగా ఎంతో గర్విస్తున్నానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News