: ప్రముఖ కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ కన్నుమూత
సుప్రసిద్ధ కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ (94) కన్నుమూశారు. పుణేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన పూర్తిపేరు రాశిపురం కృష్ణస్వామి లక్ష్మణ్. లక్ష్మణ్ 50 ఏళ్లపాటు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో కార్టూనిస్టుగా పనిచేశారు. కన్నడ వ్యంగ్య పత్రిక 'కొరవంజి'లోనూ వ్యంగ్య చిత్రకారుడిగా విధులు నిర్వర్తించారు. ప్రముఖ రచయిత ఆర్కే నారాయణ్ కు లక్ష్మణ్ సోదరుడు.