: అమెరికా వలలో చిక్కుకోవద్దు: భారత్ కు చైనా 'రిపబ్లిక్ డే' సందేశం
భారత గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో చైనా సందేశం వెలువరించింది. అమెరికా, దాని మిత్రదేశాలు పన్నిన వలలో చిక్కుకోవద్దని భారత్ కు సూచించింది. భారత్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్నేహహస్తం చాచింది. చైనా అధ్యక్షుడు ఝి జిన్ పింగ్ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సందేశమిస్తూ, భారత్ తో కలిసి శాంతిని పెంపొందించే దిశగా ప్రయత్నాలకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కాగా, బీజింగ్ కు వ్యతిరేకంగా న్యూఢిల్లీని ఉసిగొల్పేందుకు అమెరికా కుతంత్రాలకు పాల్పడుతోందంటూ గ్లోబల్ టైమ్స్, పీపుల్స్ డైలీ పత్రికల్లో ఓ వ్యాసం ప్రచురితమైంది.