: భారత సైనికులకు 'థాంక్స్' చెప్పిన పాక్ దళాలు
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నియంత్రణ రేఖ వద్ద పలు ప్రాంతాల్లో భారత సైనికులు సరిహద్దుకు ఆవల ఉన్న పాక్ బలగాలకు మిఠాయిలు పంచారు. భారత సైనికుల చొరవకు పాక్ దళాలు సంతోషం వ్యక్తం చేశాయి. తమవైపు నుంచి చొరబాట్లు, ఉల్లంఘనలు ఉన్నా, భారత దళాలు తమకు స్వీట్లు పంచడంపై కృతజ్ఞతలు తెలిపాయి. కమాన్ పోస్టు, తీత్వాల్ ప్రాంతాల్లో మిఠాయిలు పంచారు.