: మంత్రి బాలరాజుకు భద్రాద్రిలో చేదు అనుభవం
ఖమ్మం జిల్లా ఇన్ ఛార్జి మంత్రి బాలరాజుకు నేడు భద్రాచలంలో చేదు అనుభవం ఎదురైంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్టు వస్త్రాల సమర్పణ కోసం భద్రాద్రి చేరుకొనగా.. ఆయనకు స్వాగతం పలికేందుకు మంత్రి బాలరాజు అక్కడికి వచ్చారు. అయితే పోలీసులు ఆయన్ను అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. మంత్రి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.