: ఢిల్లీలో కిరణ్ బేడీని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: వెంకయ్యనాయుడు


ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఓటు వేసే క్రమంలో ఢిల్లీ ప్రజలు ప్రలోభాలకు లోనుకాబోరని అన్నారు. అంతకుముందు, వెంకయ్యతో కిరణ్ బేడీ భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. అనంతరం, వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ, క్రమశిక్షణ, నిజాయతీ ఉన్న వ్యక్తి బేడీ అని ప్రశంసించారు. ఢిల్లీ పోలీసు, ఎన్ డీఎంసీ, డీడీఏ కేంద్రం పరిధిలో ఉన్నాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్రం కలసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని, ఢిల్లీకి కేంద్ర సాయం, మార్గదర్శకత్వం అవసరమని వెంకయ్య పేర్కొన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వాలు ఉంటేనే పురోగతి సులువవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశం మోదీవైపు చూస్తోందని పునరుద్ఘాటించారు. మరోవైపు, కేంద్రంతో కలసి పనిచేసే సమయమిదేనని కిరణ్ బేడీ అన్నారు. బీజేపీ వస్తేనే సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News