: వాన దెబ్బకు భారత్-ఆసీస్ వన్డే మ్యాచ్ రద్దు


భారత్-ఆసీస్ మధ్య ట్రై సిరీస్ వన్డే మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. సిడ్నీలో వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. రాయుడి వికెట్ పడిన తర్వాత వర్షం మరోమారు కురవడంతో మ్యాచ్ కు అంతరాయం కలిగింది. మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో, ఇరు జట్ల ఖాతాలో రెండేసి పాయింట్లు చేరాయి. భారత్ తన తదుపరి మ్యాచ్ ను జనవరి 30న ఇంగ్లాండ్ తో ఆడనుంది. పెర్త్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. టీమిండియా ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను ఓడించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News