: త్వరలో కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ నేతలు: షబ్బీర్ అలీ


తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తరువాత టీఆర్ఎస్ నేతలే కాంగ్రెస్ లోకి వస్తారని ఆ పార్టీ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. వలసలు ఖాయమని స్పష్టం చేశారు. రాజీనామా చేస్తానని చెప్పిన రాజయ్యను ఎందుకు బర్తరఫ్ చేశారో కారణాలు చెప్పాలన్నారు. అంటే, అవినీతి జరిగి ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు అలీ మీడియాతో మాట్లాడుతూ, వైద్యశాఖలో జరిగిన స్కాంల వివరాలు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఫిరాయింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్లకు వేలసంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని... వాటిలో సీఎం కార్యాలయం, మంత్రులు, అధికారులపైనే ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. ఇక, హైదరాబాదులో అయ్యప్ప సొసైటీ ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ఎందుకు ఆపేశారో సమాధానం చెప్పాలని, ఈ వ్యవహారాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News