: చూయింగ్ గమ్ నములుతూ కూర్చున్న ఒబామా... అది 'నికోరెట్' అట!
ఒక వైపు గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతుంటే, వాటిని ఆస్వాదిస్తూనే ఒబామా చూయింగ్ గమ్ నములుతూ కనిపించారు. పలుమార్లు చూయింగ్ గమ్ ను బయటకు తీసి మళ్ళీ నోట్లో పెట్టుకోవడం కనిపించింది. సామాజిక మాధ్యమాల్లో ఒబామా చూయింగ్ గమ్ వ్యవహారం చర్చకు దారితీసింది. అది 'నికోరెట్' అయ్యుండొచ్చని వైట్ హౌస్ కరెస్పాండంట్ పీటర్ బాకర్ ట్వీట్ చేశారు. ఇక, పలువురు ఇండియన్లు అయితే రకరకాలుగా తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. పోనీలే, అది గుట్కా కాదుగా... అని ఒకరంటే, ఆ కాసేపు చూయింగ్ గమ్ నమలకుంటే ఏమవుతుందని ప్రశ్నించారు కొందరు.