: బులెట్ ప్రూఫ్ మాత్రమే... వెదర్ ప్రూఫ్ కాదు... తన గొడుగు తానే పట్టుకు కూర్చున్న ఒబామా


శత్రువులు దాడి చేస్తారేమోనన్న అనుమానంతో చుట్టూ బులెట్ ప్రూఫ్ అద్దాల గదిని నిర్మించారు గానీ, వర్షం రావచ్చునేమో అన్న అనుమానం అధికారులకు రాలేదు. దీంతో గణతంత్ర వేడుకలు ముగిసే వరకూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చిరుజల్లుల మధ్యనే కూర్చున్నారు. వేడుకల ఆరంభంలో వర్షం కాస్త ఎక్కువగా పడుతుండటంతో ఒబామా తన గొడుగును తానే పట్టుకొని కూర్చున్నారు. కాసేపటికి వర్షం తగ్గుముఖం పట్టినా చిరుజల్లులు మాత్రం ఆగలేదు. వేడుకలు చూసేందుకు వచ్చిన ప్రజలు సైతం వర్షాన్ని లెక్క చేయలేదు. అయితే, దట్టమైన మేఘాల కారణంగా విమాన విన్యాసాలు మాత్రం వీక్షకులను అలరించలేకపోయాయి.

  • Loading...

More Telugu News