: నీకు చేతగాక దళితుడిని బలిస్తావా?: కేసీఆర్ పై దానం తీవ్ర విమర్శలు
స్వైన్ ఫ్లూను అరికట్టే విషయంలో ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే దళితుడైన రాజయ్యను బలిచ్చారని దానం నాగేందర్ విమర్శించారు. రాజయ్యను ఇరికించి కేసీఆర్ తన తప్పును దాచుకోవాలని చూస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ను, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తప్పుదోవ పట్టించారని దానం నాగేందర్ పేర్కొన్నారు. వ్యాధి ప్రభావంపై సోమేష్ తప్పుడు నివేదికలు ఇచ్చాడని ఆరోపించారు. స్వైన్ ఫ్లూతో నష్టం రాదని చెప్పబట్టే రాజయ్య కొంత అలసత్వం చూపి ఉండవచ్చని ఆయన అన్నారు.