: 100 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన బాబు


గణతంత్ర దినోత్సవం రోజున విజయవాడలో 100 కొత్త ఆర్టీసీ బస్సులను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆర్టీసీ బస్సుల్లో వెహికల్ ట్రాకింగ్ సిస్టంను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు ప్రసంగిస్తూ, ఆర్టీసీని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. వచ్చే ఐదారేళ్లలో దేశంలోనే ఏపీఎస్ఆర్టీసీని ప్రథమ స్థానంలో నిలుపుతామని తెలిపారు. ప్రజలకు క్వాలిటీతో కూడిన సేవలను అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక వేళ నష్టం వస్తే మరో మార్గంలో భర్తీ చేసుకుందామని అన్నారు.

  • Loading...

More Telugu News