: గతేడాది లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయమని అద్వానీ అడిగారు: కిరణ్ బేడీ
గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తనను పోటీ చేయాలని బీజేపీ సంప్రదించిందని ప్రస్తుత ఆ పార్టీ ఢిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ వెల్లడించారు. ఢిల్లీలో పార్టీ ప్రచార ర్యాలీ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ విషయంపై బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ వ్యక్తిగతంగా తనను కోరారని చెప్పారు. అంతేగాక, తాను ఢిల్లీ పోలీస్ గా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ లో చేరాలని కూడా ఆహ్వానం వచ్చిందని తెలిపారు. కానీ, ఈ రెండింటినీ తాను తిరస్కరించానని వివరించారు. ఇదిలా ఉంటే, తాను ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి అయితే బాగుండేదంటూ వార్తాపత్రికల ద్వారా ఆ పార్టీ ఇచ్చిన ఆఫర్ కు సమాధానం ఇవ్వాలనుకోవడంలేదన్నారు.