: వైసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
హైదరాబాదులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోటస్ పాండ్ కార్యాలయంలో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితర పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం జగన్ కొద్దిసేపు ప్రసంగించారు.