: నా మనసుకు ఎంతో బాధగా ఉంది: కేసీఆర్


రాజయ్యను మంత్రి పదవి నుంచి తప్పించాల్సిరావడం తనకు చాలా బాధ కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మంత్రివర్గ సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణ సమయంలో ఆరోపణలు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా తన ఆరునెలల పరిపాలనలో కార్మికశాఖ మంత్రి రూ.10 వేల లంచం తీసుకున్నాడని ఆరోపణలు రావడంతో పదవి నుంచి తప్పించారని గుర్తుచేశారు. రాజయ్యపై ఫిర్యాదులు వస్తుంటే పద్ధతి మార్చుకోవాలని చాలాసార్లు సహచరులతో చెప్పించినా తీరు మార్చుకోలేదని మంత్రులతో అన్నట్లు తెలుస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం నీతిగా,నిజాయతీగా, నిబద్ధతతో పనిచేస్తుందనే పేరు వస్తున్న సమయంలో రాజయ్య ఇలా చేయడం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News