: మోదీ కుర్తాకు ఒబామా ఫిదా... మొసలితోనే పోరాడిన యోధుడు మోదీ: ఒబామా పొగడ్తలు


ప్రధాని నరేంద్రమోదీ ధరించిన కుర్తాను చూసి అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫిదా అయిపోయారు. మోదీ ధరించే కుర్తాను తాను కూడా ధరించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. "మీ దోస్తీ మంచి అనుభూతిని కలిగిస్తోంది. మీ ఆతిథ్యాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మిషెల్లీ తరువాత నా స్టైల్ ఐకాన్ ఎవరంటే అది మోదీనే. ఆయన ధరించిన కుర్తా ఎంతో బాగుంది. అటువంటి డ్రెస్ నేను కూడా ధరించాలని కోరుకుంటున్నా" అని ఒబామా అన్నారు. "మోదీ ఒకప్పుడు మొసలి దాడి నుంచి తప్పించుకున్నారని తెలిసింది. ఈ విషయం నాకు ఇంతకుముందు తెలియదు. ఆయన అంతటి స్ట్రాంగ్" అని పొగడ్తలతో ముంచెత్తారు.

  • Loading...

More Telugu News