: నేడు సత్తా చూపనున్న నవ్యాంధ్ర!
ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు కాసేపట్లో జరగనున్నాయి. ఈ వేడుకలను 'నభూతో న భవిష్యత్' అనే రీతిలో జరపాలని నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు. ఆయన ఆదేశాలతో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సుమారు ఒక గంటా నలభై నిమిషాల పాటు జరిగే వేడుకల్లో నవ్యాంధ్ర సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రదర్శనలు నిర్వహించి సత్తా చాటాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.