: ఆరుగురు తెలుగు 'పద్మ'ములు
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'పద్మ' అవార్డుల్లో ఆరుగురు తెలుగువారికి స్థానం లభించింది. వీరందరికీ పద్మశ్రీ పురస్కారం లభించింది. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులకు ఒక్క తెలుగు ప్రముఖుడు కూడా ఎంపిక కాకపోవడం గమనార్హం. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన తెలుగువారిలో ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు, డాక్టర్ అనగాని మంజుల, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, క్రికెట్ మహిళా క్రీడాకారిణి మిథాలిరాజ్, ప్రముఖ కేన్సర్ వ్యాధి నిపుణుడు నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ రఘురాముడు ఉన్నారు.