: కారులో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం


అరాచకాల ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తుండగా, ఓ కారులో భారీఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. గణతంత్రదినోత్సవ వేడుకల సందర్భంగా దేశ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. ఘజియాబాద్ లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా, ఒక కారులో పేలుడు పదార్థాలు గుర్తించారు. దీంతో కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హై ఎలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News