: పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్టులకే ఆహ్వానం...సినీ తారలకు నో ఎంట్రీ
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గౌరవార్థం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు రాజకీయనాయకులు, పారిశ్రామిక దిగ్గజాలకు మాత్రమే ఆహ్వానాలు పంపారు. సాధారణంగా వేడుకల్లో హడావుడి చేసే సినీ తారలకు ఆహ్వానం లేకపోవడం చర్చను రేకెత్తిస్తోంది. రాష్ట్రపతి భవన్ సుమారు 250 మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. వీరిలో నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి, సరోద్ విద్యాంసుడు అమ్జాద్ అలీ ఖాన్, పర్యావరణవేత్త ఆర్కే పచౌరీ, ప్రతిపక్ష నేతలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, కార్పొరేట్ దిగ్గజాలు రతన్ టాటా, గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, నారాయణమూర్తి, చందా కొచ్చర్, ప్రతాపరెడ్డి వంటి వారు ఉండడం విశేషం.