: రుణమాఫీ అమలులో బ్యాంకర్లు ముఖ్యభూమిక పోషించాలి: కోడెల
రైతు రుణమాఫీ అమలులో బ్యాంకర్లు కీలక భూమిక పోషించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సూచించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రుణమాఫీ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, రుణమాఫీ పక్కాగా అమలు కాకపోతే ప్రభుత్వానికి అపనిందతో పాటు, బ్యాంకర్లు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. సాంకేతిక సమస్యలు ఉంటే ప్రభుత్వంతో సంప్రదించాలని ఆయన సూచించారు. అర్హులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని ఆయన అధికారులకు సూచించారు. రెవెన్యూ, వ్యవసాయాధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పని చేస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన స్పష్టం చేశారు.