: నేను కొత్తవాడ్ని...రెండు దేశాల బంధాలు నిర్ణయించేంది నేతలే: మోదీ
దేశ ప్రధానిగా కొత్తగా బాధ్యతలు చేపట్టానని మోదీ తెలిపారు. మోదీ, ఒబామా సంయుక్త సమావేశం సందర్భంగా మాట్లాడుతూ, ఈ తక్కువ సమయంలో ఏది చేయాలో ఏది చేయకూడదో తనకు పెద్దగా అవగాహన లేదని తెలిపిన ఆయన నేతల మధ్య ఉన్న బంధమే రెండు దేశాల మధ్య సంబంధాలు పటిష్టమవ్వాలో? లేదో నిర్ణయిస్తుందని అభిప్రాయపడ్డారు. కెమేరా ముందు మాట్లాడితే అందులో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని, అదే వ్యక్తిగతంగా మాట్లాడుకున్నప్పుడు భేషజాలకు తావు ఉండదని, మనసు విప్పి మాట్లాడే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సంబంధం అందరు నేతల మధ్య ఉండాలని ఆయన పేర్కొన్నారు.