: రెడ్ కార్పెట్ పై కుక్క... అధికారుల హడల్


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా ఓ ఊరకుక్క అధికారులను హడలెత్తించింది. రెడ్ కార్పెట్ స్వాగతం తనకే అనుకుందో ఏమో కానీ రాష్ట్రపతి భవన్ లో రెడ్ కార్పెట్ పై పరుగులెత్తింది. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ఊరకుక్క ఎలా ప్రవేశించిందో తెలియని భద్రతా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అక్కడే త్రివిధ దళాలు ఉన్నప్పటికీ, విధులను పక్కన పెట్టి కుక్కను తరమలేని సంకట స్థితిలో పడిపోయారు. దీంతో సమాచారం అందుకున్న డాగ్ స్క్వాడ్ సిబ్బంది వచ్చి కష్టమ్మీద కుక్కను బంధించి అక్కడి నుంచి తరలించారు. ఊరకుక్క ఎవరి ఉద్యోగం ఊడబీకుతుందోనని అధికారులు హడలిపోతున్నారు.

  • Loading...

More Telugu News