: అవమానకరమైన రీతిలో రాజయ్య బర్తరఫ్


అవమానకరమైన రీతిలో తనను పదవి నుంచి బర్తరఫ్ చేసినట్టు తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అవినీతికి పాల్పడితే, అందుకు తనను బలిపశువును చేశారని ఆయన వాపోయారు. తన శాఖలో అవినీతి జరిగిందని పేర్కొంటూ, ఇంటెలిజెన్స్ రిపోర్టులు దగ్గరపెట్టుకున్న అధినేత, తనకు వివరణ ఇచ్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడినైనందునే తనపై కక్షగట్టారని ఆయన సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. భవిష్యత్ లో ఎలాంటి అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటానని లేఖలో పేర్కొన్నప్పటికీ సీఎం ఆయన నుంచి ఎలాంటి వివరణ కోరకపోవడం అవమానమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయనను అంత అత్యవసరంగా తీసేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఆలోచించాల్సిన విషయమేనని వారు పేర్కొంటున్నారు. కాగా, రాజయ్య సామాజిక వర్గం, జిల్లా నుంచి ఆందోళన ఎదురు కాకుండా అదే ప్రాంతానికి, సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరిని వ్యూహాత్మకంగా సీఎం మంత్రివర్గంలోకి తీసుకుని ఆందోళనలను అరికట్టగలిగారని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News