: ఎంపీ కడియం మంత్రిగా ప్రమాణ స్వీకారం
వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఉపముఖ్యమంత్రి రాజయ్యను తొలగించిన కేసీఆర్, ఆయన స్థానంలో శ్రీహరిని నియమించారు. ఈ మేరకు ఆయన హైదరాబాదులోని రాజ్ భవన్ లో గవర్నర్ సమక్షంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ మంత్రివర్గం హాజరైంది. కడియం శ్రీహరికి ఉపముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. కాగా, కడియం రాకతో మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆయనకు విద్యుత్ శాఖను అప్పగించి, వైద్య శాఖను లక్ష్మారెడ్డికి కేటాయించనున్నట్టు తెలుస్తోంది.