: రాష్ట్రపతి భవన్ కు చేరిన బరాక్ ఒబామా
మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ఈ మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. ఆయనకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, రాజ్ నాథ్ సింగ్, మనోహర్ పారికర్, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల వందనాన్ని ఒబామా స్వీకరించారు.