: ఒబామా వస్తున్నాడన్నా మారని పాక్ వైఖరి!
'మా దేశ అధ్యక్షుడు వస్తున్నాడు, బరితెగించవద్దు' అని అమెరికా చేసిన హెచ్చరికలను పాకిస్తాన్ పెడచెవిన పెట్టింది. ఈ ఉదయం జమ్మూ జిల్లా పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద బీఎస్ఎఫ్ జవాన్ల పోస్టులపై పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరిపారు. పాక్ సైన్యం ఆర్ఎస్ పురా సెక్టార్లోని జోగ్వానా పోస్టుపై కాల్పులు జరిపారని సైన్యాధికారి ఒకరు తెలిపారు. తేలికపాటి ఆయుధాలు, ఆటోమేటిక్ వెపన్స్ తో కాల్పులు జరిపినట్టు వివరించారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలను భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయని ఆయన పేర్కొన్నారు.