: సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా కోడె దుర్గాప్రసాద్
సెంట్రల్ రిజర్వ్ పొలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ప్రత్యేక డైరెక్టర్ జనరల్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ నియమితులయ్యారు. ఇటీవలి వరకు ప్రధాని ప్రత్యేక భద్రతా అధికారిగా ఉన్న ఆయనను అఖిల భారత సర్వీసు కేటాయింపుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. అతి త్వరలో దుర్గా ప్రసాద్ సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.