: ఏడు కొండలూ ఎక్కకముందే దేవుడు కనిపిస్తున్నాడు!
వెంకన్న దర్శనానికి వచ్చిన భక్తులకు ఏడు కొండలూ ఎక్కకుండానే దేవుడు కనిపిస్తున్నాడు. కొండ దిగువన వాహనాలను తనిఖీ చేసి టోకెన్లు ఇచ్చే చోట ఈ ఉదయం కంప్యూటర్లు మొరాయించాయి. ఒకేసారి అన్ని ఎంట్రీ గేటుల్లో కంప్యూటర్లు పనిచేయడం ఆగిపోగా, వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన అధికారులు మాన్యువల్ టోకెన్లను జారీ చేయడం ప్రారంభించారు. ఈ పని నిదానంగా సాగుతుండటంతో వాహనాల క్యూ పెరిగిపోతున్నట్టు సమాచారం.