: ఒబామాను డబ్బు డిమాండ్ చేయబోయిన వ్యక్తి అరెస్ట్
భారత విపత్తు నిధికి 130 కోట్ల డాలర్లు (సుమారు రూ.8,190 కోట్లు) ఇవ్వాలని డిమాండ్ చేయబోయిన బోధగయ నివాసి ఇనాం రజా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ సైబర్ కేఫ్ కు వచ్చిన ఆయన ఒబామాకు ఇ-మెయిల్ రాస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి ఉర్దూలో రాసిన రెండు పేజీల లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అతనికి మతి స్థిమితం లేదని భావిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై తీవ్రవాద వ్యతిరేక దళం దృష్టిని సారించింది. రజా గత చరిత్ర ఎలాంటిదన్న విషయాన్ని వారు పరిశీలిస్తున్నారు.