: ఒబామాకు మోదీ ఆత్మీయ ఆలింగనం!


అనుకున్న సమయం కంటే సుమారు అరగంట ముందుగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను మోదీ తన ఆత్మీయ ఆలింగనంతో భారత గడ్డపైకి స్వాగతం పలికారు. ఒబామా దంపతులు ఉపయోగించే 'బీస్ట్' వాహనాన్ని నేరుగా విమానం వద్దకు తీసుకురావడంతో దాని సమీపంలోనే స్వాగత కార్యక్రమాలు పూర్తయ్యాయి. ముందుగా ఒబామాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన నరేంద్ర మోదీ, ఆ తర్వాత ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మిషెల్ ఒబామా కూడా మోదీతో చేతులు కలిపారు. అనంతరం ఒబామా, మోదీ, మిషెల్ ముగ్గురూ చేతులు ఊపుతూ ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం ఒబామా దంపతులు ఐటీసీ మౌర్య హోటల్ కు బయలుదేరి వెళ్లారు.

  • Loading...

More Telugu News