: 117 మంది ఐఎస్ఐఎస్, అల్ ఖైదా ఉగ్రవాదుల హతం
దక్షిణ సిరియాలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. సైన్యం జరిపిన దాడుల్లో 117 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఆల్ ఖైదాతో సంబంధాలున్న 47 మందిని మషారా పట్టణంలో, దక్షిణ ప్రావెన్స్ లోని దర్రార్లో 70 మందిని అంతమొందించినట్లు పేర్కొంది. అయితే సిరియా రాజధాని డెమాస్కస్లో శనివారం తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, 11 మంది గాయపడ్డారని తెలిసింది.