: డిప్యూటీ సీఎం రాజయ్యకు దొరకని సీఎం కేసీఆర్ అపాయింట్‌ మెంట్... నేడో రేపో రాజీనామా!


తెలంగాణ ప్రజలను పీడిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పదవికి ఎసరు పెట్టింది. దీనికి తోడు వైద్య ఆరోగ్య శాఖలో వివిధ పోస్టుల భర్తీ విషయంలో జరిగిన అవకతవకలపై కేసీఆర్ చాలా కోపంగా వున్నట్టు సమాచారం. ఇప్పటికే డిప్యూటీ సీఎం రాజయ్య పేషీ అధికారులందరిపైనా వేటు వేసిన కేసీఆర్, మొత్తం పేషీని ప్రక్షాళన చేయాలని హుకుం జారీ చేశారు. కాగా, నిన్న రోజంతా సచివాలయంలోని తన కార్యాలయంలోనే వున్న రాజయ్య, సీఎం ను కలవడానికి రెండు మూడు సార్లు ప్రయత్నించినా కేసీఆర్ సుముఖత చూపనట్టు తెలుస్తోంది. రెండు సార్లు ‘సి’ బ్లాక్ వద్దకు వచ్చిన రాజయ్యకు సీఎం అపాయింట్‌ మెంట్ ఇవ్వలేదు. మరోవైపు రాజయ్యను కలవడానికి ఆ శాఖ అధికారులెవరూ కూడా రాలేదు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. నేడు కేసీఆర్ తో మాట్లాడేందుకు అవకాశం లభించకుంటే నేడో రేపో ఆయన రిజైన్ చేయవచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News