: తప్పులు మన్నించండి... శిక్షించొద్దు: కేసీఆర్ కు ఉపముఖ్యమంత్రి రాజయ్య లేఖ
తాను తెలిసి ఏలాంటి తప్పు చేయలేదని, అవినీతి, అక్రమాలకు పాల్పడలేదంటూ తెలంగాణ ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరణ ఇచ్చుకున్నారు. తెలీక ఏవైనా తప్పులు చేసివుంటే మన్నించాలని ఆయన కోరారు. ఈ లేఖలో తనపై, తన శాఖపై వచ్చిన ఆరోపణలన్నింటికి ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం. కాగా, దళిత కులంలో పుట్టటమే తాను చేసిన నేరమని, ఉన్నత పదవిలో ఉండటం కొందరికి నచ్చలేదని రాజయ్య వ్యాఖ్యానించినట్టు సమాచారం. స్వైన్ ఫ్లూపై వెంటనే అవసరమైన చర్యలు తీసుకున్నామని, అనవసర ప్రచారం కారణంగా జనం మాస్కులు పెట్టుకుని తిరుగుతుండగా, డాక్టర్లు బతుకుతున్నారని ఆయన అన్నారు. వ్యాధి తీవ్రత పెరిగాక ఇప్పుడు తనను బలిపశువును చేయాలనీ చూస్తున్నారని, మీడియా కూడా సహకరించట్లేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది.