: ఈ మొగోడా కోర్టుకు పోయేది?: పొన్నాలపై మంత్రి కేటీఆర్ నిప్పులు


"ప్రజాకోర్టు తీర్పును కాదని ఈ మొగోడు సుప్రీంకోర్టు, హైకోర్టుకు పోతాడంట... ముందు నీకంటుకున్న మురికి కడుక్కో. ఏడు నెలల పసిగుడ్డు తెలంగాణ. అయినా, దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలుకాని ప్రజాసంక్షేమ పథకాలను అమలుచేస్తూ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చట్టవిరుద్ధం అంటూ ఈ మొగోడు కోర్టులకు వెళతాడట" అని తెలంగాణ మంత్రి కేటీఆర్ పీసీసీ చీఫ్ పొన్నాలపై నిప్పులు చెరిగారు. ముందు మీపై, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి తదితరులపై ఉన్న కేసుల్ని చూసుకోండని హితవు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు వ్యతిరేకంగా మాట్లాడే నైతిక హక్కు పొన్నాలకు లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News