: వైఎస్సార్సీపీ నేత అరాచకం...యువతి ఆత్మహత్యాయత్నం


తూర్పుగోదావరి జిల్లా ఆమనగరువుకు చెందిన వైఎస్సార్సీపీ నేత గుత్తుల సత్యప్రసాద్ అరాచకానికి ఓ దళిత యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. గత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో సత్యప్రసాద్ కరక్కాయపేటకు చెందిన ఓ దళిత యువతిని నగ్నంగా చిత్రీకరించి తన వద్దకు రావాలని, లేని పక్షంలో ఆ ఫోటోలను ఇంటర్నెట్ లో పెడతానని బెదిరింపులకు దిగి, గత మూడునెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. సత్యప్రసాద్ ఆగడాలు మితిమీరిపోవడంతో యువతి గత అర్ధరాత్రి దాటిన తరువాత పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, జరిగిన దాష్టీకంపై దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News