: పాస్ పోర్టు అధికారిని కోర్టుకీడ్చిన బాధితుడు


పాస్ పోర్టు జారీ చేయకుండా జాప్యం చేస్తున్న అధికారిని కోర్టుకీడ్చి సంచలనం సృష్టించారు. 2013లో పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న బాధితుడి జనన ధ్రువీకరణ సరిగా లేదంటూ పాస్ పోర్టు అధికారి పాస్ పోర్ట్ జారీ చేసేందుకు నిరాకరించారు. దీంతో బాధితుడు తన 10వ తరగతి సర్టిఫికేట్ లో ఉన్న జనన ధ్రువీకరణను పరిగణనలోకి తీసుకుని పాస్ పోర్టు జారీ చేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయస్థానం 10వ తరగతి సర్టిఫికేట్ లో ఉన్న జనన తేదీని నిర్థారిస్తూ పాస్ పోర్టు జారీ చేయాలని ఆదేశించింది. దానిని వారు బేఖాతరు చేయడంతో హైదరాబాదు ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి అశ్విని సత్తారుపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేస్తూ, రెండు రోజుల్లో బాధితుడికి పాస్ పోర్టు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News