: నేను అవార్డులను స్వీకరించను: రాందేవ్ బాబా
పద్మ అవార్డును అందజేయనున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ, దేశ సేవ చేయడమన్నది తన సన్యాసి ధర్మమని అన్నారు. దేశ సేవ కోసం ఎవరైనా అవార్డులిస్తే వాటిని తాను తిరస్కరిస్తానని ఆయన స్పష్టం చేశారు. అవార్డులను తాను తీసుకోనని ఆయన తెలిపారు. కాగా, ఆయనకు పద్మ అవార్డు ఏ అర్హతతో ఇస్తారని ప్రతిపక్షాలు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై జాతీయ మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి.