: పవన్ కల్యాణ్ కు అభిమానుల భక్తిగీతం
సినిమా హీరోలకు అభిమానులు సర్వసాధారణం. కానీ టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ కు అభిమానులను మాత్రం భక్తులంటే బాగుంటుందేమో! 'గోపాల గోపాల' సినిమాలో పవన్ కల్యాణ్ ను దేవుడిగా చూసిన ఆయన అభిమానులు స్ఫూర్తి పొంది, ఆయనపై ఓ భక్తి గీతాన్ని రూపొందించారు. ఈ భక్తి గీతాన్ని పవన్ కల్యాణ్ నటించిన సినిమాల్లోని పాటలతో భజనలా రూపొందించడం విశేషం. భజనకు వచ్చినట్టే పవన్ ను పూజించడానికి రావడం, అందరికీ బొట్లుపెట్టడం, భజన అయ్యాక ప్రసాదాలు పంచడం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ పాట యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.