: బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయండి: మోదీ
జన్ ధన్ యోజన పథకం కింద ప్రజలు తీసుకున్న బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ బ్యాంకర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు దేశంలో జన ధన్ యోజన పథకం కింద 99.74 శాతం ఖాతాలు తెరుచుకున్నాయని ఆయన తెలిపారు. బ్యాంకర్ల సహకారం మరువలేనిదని ప్రధాని మోదీ బ్యాంకర్లను అభినందించారు. కాగా, దేశంలోని పలు బ్యాంకుల్లో ఆధార్ అనుసంధానం ఇప్పటికే ఊపందుకుంది. జన ధన్ యోజన పథకంతో సంబంధం లేకుండా కొత్త ఖాతాదారులకు కూడా బ్యాంకులు ఆధార్ జత చేయాలని సూచిస్తున్నాయి.