: తెలుగు వారియర్స్ ఘన విజయం


సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) లో తెలుగు వారియర్స్ జట్టు దూసుకుపోతోంది. వరుసగా మూడు విజయాలు నమోదు చేసిన తెలుగు వారియర్స్ జట్టు సెమీఫైనల్ లో ఇప్పటికే చోటు సంపాదించుకుంది. సినీ హీరోలు క్రికెటర్లుగా మారి ఎల్బీస్టేడియంలో సందడి చేశారు. కర్ణాటక బుల్డోజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ జట్టు ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక బుల్డోజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. 188 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన తెలుగు వారియర్స్ జట్టు 18.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కర్ణాటక జట్టులో 'ఈగ' సినిమా ఫేమ్ సుదీప్ రాణించగా, తెలుగు వారియర్స్ జట్టులో 'బస్టాప్' ఫేమ్ ప్రిన్స్ అర్ధ సెంచరీతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలవగా, 'పిల్లా నువ్వులేని జీవితం' ఫేమ్ వరుణ్ తేజ్ విన్నింగ్ షాట్ గా సిక్సర్ కొట్టి ముగింపునిచ్చాడు. బౌలింగ్ లో ఆదర్శ్ రాణించాడు.

  • Loading...

More Telugu News