: లండన్ లో అంబేద్కర్ భవన్ కొనేసినట్టేనా?


భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకప్పుడు లండన్ లో నివసించిన భవనాన్ని కొనుగోలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2,050 చదరపు అడుగుల్లో ఉన్న ఈ మూడంతస్తుల భవనాన్ని 35 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని లండన్ పర్యటనలో ఉన్న మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే తెలిపారు. దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో తాను మాట్లాడానని, ఈ భవన కొనుగోలు విధివిధానాలపై చర్చించానని ఆయన వెల్లడించారు. గతంలో ఈ భవనాన్ని మహారాష్ట్ర ప్రభుత్వంతో కొనిపించేందుకు మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు.

  • Loading...

More Telugu News