: ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు కేజ్రీకి అందని ఆహ్వానం
ఈ నెల 26న ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముుఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఆహ్వానం రాలేదు. దీనిపై ఆ పార్టీ ఆక్రోశాన్ని వ్యక్తం చేసింది. "ఢిల్లీకి ఓ మాజీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ ను ఆహ్వానించాలి" అని ఓ ప్రకటనలో ఆప్ పేర్కొంది. ఇదిలాఉంటే కేజ్రీవాల్ కు మాత్రం వేడుకల్లో పాల్గొనాలని ఉంది. తనను ఎందుకు పిలవలేదో తెలియదని, తాను మాత్రం వెళ్లాలనుకుంటున్నట్టు కేజ్రీ చెప్పారు. దీనిపై బీజేపీ స్పందిస్తూ, ప్రోటోకాల్ ప్రకారం చూస్తే మాజీ సీఎంలను రిపబ్లిక్ డే ఉత్సవాలకు పిలవరని చెబుతోంది. కానీ సంప్రదాయం ప్రకారం దేశ రాజధాని మాజీ సీఎంలందరిని రాజ్ పథ్ లో జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానించాలట.