: స్వతంత్ర భారతావనిని సందర్శించిన అమెరికా అధ్యక్షులు ఆరుగురే!


స్వతంత్ర భారతావనిని సందర్శించిన అమెరికా అధ్యక్షులు కేవలం ఆరుగురే. ఇందులో ఒబామా రెండు సార్లు అమెరికా అధ్యక్షుడి హోదాలో పర్యటిస్తున్నట్టు లెక్క. 1959లో తొలిసారి అమెరికా అధ్యక్షుడు ఐసన్ హోవర్ భారత్ ను సందర్శించారు. అనంతరం పదేళ్ళ తరువాత 1969లో రిచర్డ్ నిక్సన్ భారత్ ను సందర్శించారు. ఆయనే భారత్ తో సంబంధాలు పటిష్టం చేసుకునేందుకు నాంది పలికినట్టు విశ్లేషకులు చెబుతారు. ఆ తరువాత 1979లో జిమ్మీ కార్టర్ భారత్ ను సందర్శించారు. సుదీర్ఘ విరామం తరువాత 2000లో బిల్ క్లింటన్ భారత్ లో పర్యటించి అమెరికా, భారత్ బంధాన్ని పటిష్టం చేశారు. ఆ తరువాత 2006లో వచ్చిన జార్జ్ డబ్ల్యూ బుష్ జూనియర్ వాటిని మరింత బలోపేతం చేశారు. 2010లో ఒబామా పర్యటనతో భారత్ తో అమెరికా మైత్రి విడదీయలేనంత పటిష్టమైంది. దీంతో ఒబామా మరోసారి భారత్ లో అధికారికంగా పర్యటిస్తున్నారు. భారత్, అమెరికా దేశాల పరస్పర సహకారం ప్రపంచాభివృద్ధికి ఎంతో కీలకమని రెండు దేశాల అధినేతలు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News