: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి భూపతి జోడి నిష్క్రమణ
ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో మహేశ్ భూపతి జోడీ తొలి రౌండులోనే నిష్క్రమించింది. ఈ విభాగంలో మహేశ్, ఆస్ట్రేలియన్ క్రీడాకారిణి జర్మిలా గడసోవా భాగస్వామ్యం... చైనీస్ తైపీ జంట హ్యోచింగ్ ఛాన్, బ్రిజ్ జమైముర్రేలతో తలపడి ఇంటి ముఖం పట్టింది. ఈ రెండు జోడీల మధ్య జరిగిన ఆటలో భూపతి జోడీ మొదట్లో గట్టి పోటీ ఇచ్చి తొలి సెట్ ను 29 నిమిషాల్లో సొంతం చేసుకుంది. దాంతో రెండో సెట్ లో చైనీస్ తైపీ జంట బలపడి పుంజుకోవడంతో భూపతి, గడసోవాలు వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో 6-4, 6-7 97) (8-10) తేడాతో ఈ జోడి పరాజయం పాలైంది.