: ఆర్టీసీకి 100 కొత్త బస్సులు: మంత్రి శిద్ధా రాఘవరావు


ఆర్టీసీకి వంద కొత్త బస్సులు కొనుగోలు చేసినట్టు ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. గణతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వాటిని ప్రారంభిస్తామని చెప్పారు. విజయవాడలో జరిగిన ఆర్టీసీ భద్రతా వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ప్రైవేటీకరణపై మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయమని పునరుద్ఘాటించారు. నష్టాలు లేని సంస్థగా ఆర్టీసీని తీర్చిదిద్దుతామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. మరోవైపు త్వరితంగా ఆర్టీసీని విభజిస్తామని కొత్త ఆర్టీసీ వైస్ ఛైర్మన్, ఎండీ సాంబశివరావు చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News