: తాడేపల్లి వద్ద, కృష్ణా కరకట్ట సమీపంలో బీజేపీ కార్యాలయం... వెంకయ్య శంకుస్థాపన


తెలుగు రాష్ట్రాల్లో పుంజుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ... నవ్యాంధ్రలోనూ కొత్తగా కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ సమీపంలోని తాడేపల్లి వద్ద కృష్ణా కరకట్ట పక్కగా పార్టీ కార్యాలయానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కొద్దిసేపటి క్రితం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యాలయ నిర్మాణంలో ఎలాంటి నిబంధనలను అతిక్రమించొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. అన్ని అనుమతులు మంజూరైన తర్వాతే నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News